మనం మన ఓటు హక్కును వినియోగించు కోవలసిన అవసరం వుంది. అందువలన ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయ కాలం అయిన ఎన్నికల కాలం వచ్చేసింది. అందువలన ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్న విషయం ఓట్లు తొలగింపు దరఖాస్తులు.
ఓటర్ల ప్రమేయం లేకుండానే ఓటు తొలగించాలని వస్తున్న వత్తిడి అంతా ఇంతా కాదు. ఇటువంటి సమయములో ఓటర్లు తమ కార్డు వివరాలు చిటికెలో తెలుసుకునే అవకాశం వెబ్సైటు ద్వారా గాని యాప్ ద్వారా గాని తెలుసుకోవచ్చు. కొంచెం సమయం పట్టినా మామోలు మొబైల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
![]() |
Digital IT Online - To know Voter Card Details |
I) మొబైల్ యాప్ ద్వారా ఓటర్లు తమ కార్డు వివరాలు తెలుసుకునే విధానం:
1. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి voter helpline ('ఓటరు హెల్ఫ్‌లైన్') అనే యాప్‌ను వెతికి మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి (డౌన్లోడ్ చేసుకోవాలి).
2. ఓటరు హెల్ఫ్‌లైన్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ రోల్‌పై క్లిక్ చేసి ఓటరు పేరు, తండ్రి పేరు, వయస్సు,జెండర్, స్టేట్, జిల్లా, నియోజకవర్గం వంటి వివరాలు నమోదు చేసి సెర్చ్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.
ఓటరు జాబితాలో ఆ పేరు ఉంటే వెంటనే స్మార్ట్‌ఫోన్ తెరపై ఆ పేరుతో వివరాలు కనిపిస్తాయి.
(లేదా)
మీ ఓటరు కార్డు నంబరు తెలిసి ఉంటే ఆ (EPIC No)నంబరును యాప్‌లో నమోదు చేయడం ద్వారా కూడా ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
దానికోసం ఓటరు హెల్ఫ్‌లైన్ యాప్ ఓపెన్ చేసి, అందులో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రోల్ రోల్‌పై క్లిక్ చేసి తరువాత కుడివైపు వున్న సెర్చ్ బై ఎపిక్ నెంబర్ పై క్లిక్ చేసి, ఓటరు కార్డు మీద వున్న ఎపిక్ నంబరును టైపు చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే స్మార్ట్‌ఫోన్ తెరపై ఆ పేరుతో వివరాలు కనిపిస్తాయి.
ఈ యాప్ వుపయోగించి మన భారత దేశం లో ఎవరి ఓటర్ కార్డు గురించైనా తెలుసుకోవచ్చు.
(లేదా)
II) మొబైల్ ద్వారా ఓటర్లు తమ కార్డు వివరాలు తెలుసుకునే విధానం:
స్మార్ట్ ఫోన్ లేని వారు మామోలు ఫోన్ నుంచి టోల్‌ఫ్రీ నంబరు 1800111950 కు గాని లేదా 1950 కు గాని కాల్ చేస్తే వివరాలు తెలుస్తాయి.
III) వెబ్సైటు ద్వారా ఓటర్లు తమ కార్డు వివరాలు తెలుసుకునే విధానం:
1. https://electoralsearch.eci.gov.in/
పైన చెప్పిన విదంగానే వెబ్సైటు లోకి వెళ్లి అన్ని వివరాలు ఇట్చి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తే కంప్యూటర్ తెరపై ఆ పేరుతో ఓటరు వివరాలు కనిపిస్తాయి.
No comments:
Post a Comment