సోషల్ నెట్వర్క్ సైట్ లలో పింటరెస్ట్‌లో ద్వార ఇంతకు ముందు వారు ఎలా సంపాదించారు?
బరువు తగ్గడానికి చిట్కాలు... పెరట్లో కొత్తిమీరను పెంచుకోవడం ఎలా... క్యాన్సర్ గురించి జరిగిన తాజా అధ్యయనం... తెలుగు రాష్ట్రాల్లో చూడదగ్గ ప్రదేశాలు... మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఫ్యాషన్లూ గ్యాడ్జెట్లు... ఏదైనా చూడగానే అర్థమైపోయేలా ఫొటోలతో కళ్లకు కడుతుంది పింటరెస్ట్. రిజిస్టర్ చేసుకుంటే చాలు, గూగుల్ ఫొటోల్లా పింటరెస్ట్‌లో అప్‌లోడ్ అయిన ప్రతి ఫొటో అందరికీ కనిపిస్తుంది. చెప్పాలనుకున్న విషయానికి సంబంధించి ఫొటోలూ వాటికి సంబంధించి ఒకటీ రెండులైన్ల సమాచారం మాత్రమే తెరమీద ఉంటుంది. మరికొంత తెలుసుకోవాలంటే సంబంధిత వెబ్‌సైట్‌కి పంపే లింక్ ఫొటో కింద కనిపిస్తుంది. పింటరెస్ట్ నుంచి ఆదాయం పొందే లింక్ కూడా అదే. ఉదాహరణకు అమెజాన్ ఆన్‌లైన్ దుకాణంలో మనకేదైనా డ్రెస్సూ లేదా గ్యాడ్జెట్ నచ్చిందనుకోండి, దాని ఫొటోను పింటరెస్ట్‌లో పోస్ట్ చేసి కింద అమెజాన్ లింక్‌ని ఇవ్వొచ్చు. ఆ ఉత్పత్తి నచ్చితే వాళ్లు అందులోకి వెళ్లి కొనుక్కుంటారు. అలా మనద్వారా తమ సైట్‌లో ఆ ఉత్పత్తిని ఎంతమంది కొంటే అంత కమిషన్ మనకొచ్చినట్లే. దీన్లో వివిధ వ్యాపార సంస్థలకు చెందిన ఉత్పత్తులకు మనం చేసే ప్రచారమే ఆదాయ మార్గం. సొంతంగా వ్యాపారాలున్నవాళ్త్లెతే ఆ వెబ్‌సైట్ లింక్‌ని ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకోవచ్చు.
No comments:
Post a Comment