సోషల్ నెట్వర్క్ సైట్ లలో ట్విట్టర్ ద్వార ఇంతకు ముందు వారు ఎలా సంపాదించారు?
‘గత ఆరునెలల్లో ట్విటర్‌లో పోస్ట్ చేసిన కొన్ని ట్వీట్‌ల ద్వారా 30లక్షల రూపాయలు సంపాదించాను’... కొద్దిరోజుల కిందట ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పిన మాట ఇది. హాస్యాన్ని పండిస్తూనో వివాదాస్పద ట్వీట్లతోనో ఎప్పుడూ వార్తల్లో నిలిచే సెహ్వాగ్‌ను ట్విటర్‌లో 90లక్షల మంది అనుసరిస్తున్నారు. అందుకే, అతడు ఏదైనా బ్రాండ్ ఉత్పత్తి గురించి ట్విటర్‌లో మెసేజ్ పెట్టినా దానికి సంబందించిన ఫొటోను ట్వీట్ చేసినా ఆయా కంపెనీలు ఒక్కో ట్వీట్‌కీ లక్షలు కుమ్మరిస్తాయి. అతి తక్కువ పదాలతో మెసేజ్‌ను షేర్ చేసుకునే సామాజిక వెబ్‌సైట్‌గా యువతలో ఎంతో ప్రాచుర్యం పొందిన ట్విటర్లో సామాన్యులకూ సంపాదన అవకాశాలు చాలానే. ఎక్కువమంది ఫాలోవర్లు ఉన్న ఏ అకౌంట్‌లోనైనా ప్రకటనలకు సంబంధించిన ట్వీట్లు చేస్తే, ఒక్కో ట్వీట్‌కీ కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి సంబంధిత కంపెనీలు. మనం చేసిన ట్వీట్లను ఎవరైనా చూసినప్పుడు కూడా ఒక్కో క్లిక్‌కీ కొంత డబ్బు మన అకౌంట్‌లో చేరుతుంది. యాభైమంది ఫాలోవర్లున్నా చాలు, ఆదాయం పొందే వీలుండడమే ట్విటర్ వెబ్‌సైట్ ప్రత్యేకత. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలోని ఏదైనా ఉత్పత్తి గురించి కూడా ఈ సైట్‌లో ట్వీట్ చెయ్యొచ్చు. మనం ఇచ్చిన లింక్ ద్వారా ఆ సైట్‌లోకి వెళ్లిన వారు ఏదైనా కొనుగోలు చేస్తే అందుకు మనకు కమిషన్ వస్తుంది.
ట్వీట్లకూ ఆదాయం
ట్విటర్‌లో ఎవరైనా ప్రకటనల ద్వారా సులభంగా ఆదాయాన్ని పొందొచ్చు. అయితే, అందుకోసం మన అకౌంట్‌ను కనీసం 50మంది అనుసరించాల్సుంటుంది. తర్వాత ట్విటర్ అకౌంట్‌ను స్పాన్సర్డ్‌ట్వీట్స్, మై లైక్స్ సైట్లకు అనుసంధానించుకోవాలి. ఈ సైట్లద్వారా ఎంపిక చేసుకున్న ప్రకటనల గురించి మన అకౌంట్లో ట్వీట్ చెయ్యొచ్చు. అలా చేసిన ప్రతిసారీ ఒక్కో ట్వీట్‌కీ కొంత మొత్తాన్ని మన పేపాల్ అకౌంట్లో జమ చేస్తాయి ఆయా ప్రకటనల సంస్థలు. అంతేకాదు, మనం ట్వీట్ చేసిన సందేశాన్ని మన ఫాలోవర్లు క్లిక్ చేసిన ప్రతిసారీ ఒక్కో క్లిక్‌కీ కొంత డబ్బు మన అకౌంట్‌లో చేరుతుంది. మిగిలిన సామాజిక వెబ్‌సైట్లలానే ట్విటర్‌లో కూడా ఫాలోవర్లు పెరిగే కొద్దీ ఒక్కో ట్వీట్ ధర పెరుగుతుంది. అది వందల నుంచి లక్షల వరకూ ఎంతైనా ఉండొచ్చు.
భారత్‌లో ట్విటర్‌లో ఎక్కువ మంది అనుసరిస్తున్న వ్యక్తుల్లో నరేంద్ర మోదీ(2.8 కోట్లు), అమితాబ్ బచ్చన్ (2.5 కోట్లు), షారూఖ్ ఖాన్ (2.3 కోట్లు) మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అతి ఖరీదైన ట్వీట్ అమెరికన్ నటుడు ఛార్లీ షీన్‌దే. ఇతడు ఒక్కో ప్రచార ట్వీట్‌కి అత్యధికంగా రూ.32 లక్షలు వసూలు చేస్తున్నాడు. మనదగ్గర షారూఖ్ ఖాన్‌లాంటి వాళ్లతో ప్రచార ట్వీట్లు చేయించుకునేందుకు ఆయా కంపెనీలు ఒక్కో ట్వీట్‌కూ దాదాపు 20 లక్షల రూపాయలు చెల్లిస్తున్నాయి.
***
No comments:
Post a Comment